అత్తారింటికి వెళ్తున్నామని చెప్పి ఆ ముగ్గురు..

X
TV5 Telugu10 Sep 2019 9:59 AM GMT
పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యుల అదృశ్యం సంచలనంగా మారింది. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన జిడ్డు సూర్యగణేశ్, అతని భార్య పద్మావతి, కుమార్తె మౌనికలు ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురూ అత్తారింటికి వెళ్తున్నామని చెప్పారు. అయితే అక్కడికీ వెళ్లలేదు.. ఇంటికీ తిరిగి రాలేదు.
మూడు రోజులుగా అదృశ్యమైనవారి ఆచూకీ తెలియకపోవడంతో సూర్యగణేశ్ సోదరుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. మిస్సైన సూర్యగణేశ్‌కు చెందిన టూ వీలర్ ఇతర వస్తువులు యలమంచిలి మండలం చించినాడ వంతెన సమీపంలో లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక కొద్ది రోజులు దూరంగా ఉండాలని ఎక్కడికైనా వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also watch :
Next Story