దేశంలో అసాధారణ పరిస్థితులు.. నిపుణుల్లో ఆందోళన

దేశంలో అసాధారణ పరిస్థితులు.. నిపుణుల్లో ఆందోళన

జల సంరక్షణలో భారత్‌ పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు తోడు అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. కానీ నీటిని నిల్వ చేసుకోవడంలో మన పాలకులు కొత్త పద్ధతుల్లో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం జల సంరక్షణ దిశగా సరైన చర్యలు తీసుకోకపోయినట్లయితే భవిష్యత్‌లో పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది..

దేశంలో ఈ సారి అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి కాలంలో విపరీతమైన వేడి ఉంటే. వర్షాకాలం ఆలస్యంగా మెుదలైంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉంటే మరికొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ అకాల పరిస్థితులు వల్ల వేలాదిమంది మత్యువాత పడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంను వరదలు అతలాకుతలం చేశాయి. తర్వాత మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఇక ఆగస్టు నెలలో మధ్య భారతాన్ని వరదలు చుట్టుముట్టాయి.

1950 నుంచి 2015 వరకు సంభవించిన వాతావరణ పరిస్థితులపై పూణేలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాఫికల్‌ మేనేజ్‌మెంట్‌ అధ్యయనం చేసి 2017లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు అసాధారణ వరదల బారిన దాదాపు 82 కోట్ల మంది పడ్డారు. వారిలో 170 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 69 వేల మంది మరణించారు.

దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం పెద్దగా పెరగకపోయినా కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు పడ్డాయని బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తెలిపింది. ఈసారి కేవలం ఒకే ఒక శాతం అధిక వర్షంతో వర్షాకాలం ముగుస్తుందని అంచనా వేసినప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదయిందన్నారు. అలాగే ఈ విషయంపై జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కూడా స్పందించారు. 2001లో దేశంలోని ప్రజలకు సగటున 1816 క్యూబిక్‌ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, గత జూలై నెల నాటికి సగటున 1544 క్యూబిక్‌ మీటర్ల నీరే అందుబాటులో ఉందని మంత్రి రాజ్యసభలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story