భళా తెలంగాణ!..భారీగా పెరిగిన..

భళా  తెలంగాణ!..భారీగా పెరిగిన..

తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడేళ్లలో 126 శాతం పెరిగినట్లు ఆర్ధిక సర్వే వెల్లడించింది. 2011-12లో 91వేల 121 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం.. 2018-19 నాటికి 2 లక్షల 5 వేలకు పెరిగినట్లు సర్వే తెలిపింది. ఇదే సమయంలో.... భారత దేశ సగటు తలసరి ఆదాయం లక్షా 26 వేలు మాత్రమే ఉందని తేలింది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం జాతీయస్థాయి సగటు కంటే 3.8 శాతం అదనంగా పెరిగినట్లు ఆర్ధిక సర్వే వెల్లడించింది..

ఇక... సంపదలోనూ తెలంగాణ ఉరుకులు పెడుతున్నట్లు సర్వే వివరించింది. ఈ సారి కూడా రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగినట్లు ఆర్ధిక సర్వే పేర్కొంది. రాష్ట్ర స్తూల ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద 14.8 శాతం, స్థిర ధరల వద్ద 10.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ఎంతో ముందంజలో ఉన్నట్లు సర్వే తెలిపింది. తాజా లెక్కల ప్రకారం....2018-19 ఆర్దిక సంవత్సరంలో వివిధ రంగాల్లో రాష్ట్రం మొత్తం సంపద ..... ప్రస్తుత ధరల వద్ద 8 లక్షల 66 వేల 688 కోట్లకు పెరిగింది. 2014-15లో 12 శాతం ఉన్న జీఎస్డీపీ వృద్ధిరేటు.. 2015-16 నాటికి 14.2 శాతానికి పెరిగింది. 2016-17లో 14.2 శాతం కొనసాగగా... 2017-18లో 14.3 శాతానికి చేరింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 14.8 శాతానికి పెరిగింది...

Tags

Read MoreRead Less
Next Story