మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చిన ట్రంప్

మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చారు. మరోసారి మధ్యవర్తిత్వం మాట మాట్లాడారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఐతే, భారత్, పాకిస్థాన్ రెండు దేశాలు కోరుకుంటేనే మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పారు. రాయబారంపై 2 దేశాల నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇక, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గతంలో పోలిస్తే టెన్షన్ కొద్దిగా తగ్గిందన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఇరు దేశాల ప్రధానులకు సూచించానని చెప్పారు.

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ మాట్లాడడం గత 2 నెలల్లో ఇది నాలుగోసారి. ట్రంప్ మీడియేషన్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హర్షం వ్యక్తం చేయగా, భారత ప్రభుత్వం మాత్రం తీవ్రంగా తప్పుబట్టింది. కశ్మీర్ వ్యవహారంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్-పాకిస్థాన్‌లే పరిష్కరించుకుంటాయని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎన్నో సార్లు స్పష్టంగా వెల్లడించింది. ఐనప్పటికీ ట్రంప్ పదే పదే మీడియేషన్ ప్రస్తావన తీసుకొస్తూ వివాదం రేపుతున్నారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story