తాజా వార్తలు

వద్దు.. అలా చేస్తే అక్కడ అంతా నాశనం అవుతుంది: పవన్‌ కల్యాణ్‌

వద్దు.. అలా చేస్తే అక్కడ అంతా నాశనం అవుతుంది: పవన్‌ కల్యాణ్‌
X

నల్లమలలో యురేనియం చిచ్చు రగులుతోంది.. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వివిధ పక్షాలు చేపట్టిన బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనలు, అరెస్టులతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బంద్‌ ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్‌ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద శ్రీశైలం ప్రధాన రహదారిపై కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసిన పోలీసులు తీగలపెంట స్టేషన్‌కు తరలించారు .

యురేనియం వెలికితీతతో భారీగా రేడియేషన్‌ వెలువడుతుందని, సమీపంలో ప్రవహించే కృష్ణా నది కలుషితమై ఆ నీరు సాగర్‌లోకి వెళుతుందని తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు నేతలు. అయితే ఈ సారి పూర్తిస్థాయిలో యురేనియం కార్పొరేషన్‌ రంగంలో దిగుతుండటంతో స్థానికులు, పర్యావరణవేత్తలు మరింత ఆందోళన చెందుతున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పచ్చటి పల్లెలు ఉనికిని కోల్పోతాయని.. సమీప గ్రామాలు, తండాలకు ముప్పు తప్పదని కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు అంటున్నాయి. కృష్ణా జలాలు సైతం కలుషితం అవుతాయని వారంటున్నారు. యురేనియం తవ్వకాలను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే.. మోదీ మాత్రం ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు.

మరోవైపు ఇదే విషయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు వి.హనుమంతరావు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కలిసి రావాలని పవన్ కళ్యాణ్‌ను ఆయన కోరారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

Next Story

RELATED STORIES