Top

మంత్రి బొత్సకు చింతమనేని సవాల్

మంత్రి బొత్సకు చింతమనేని సవాల్
X

పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల తీరుపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు అరెస్ట్‌ చేయలేదని.. తానే స్వచ్ఛందంగా వచ్చాను అన్నారు. వైసీపీ నేతల దగ్గర ఎంత దమ్ము ఉంటే అంత చూపించాలని.. మంత్రి బొత్స వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. తాను తప్పు చేశానని బొత్స నిరూపిస్తే.. తన ఆస్తులు మొత్తం పేద ప్రజలకు రాసిస్తానన్నారు. గ్రామసభ పెట్టి.. ఆ ఊర్లో ప్రజలు తాను తప్పు చేశానని చెప్తే చాలు దేనికైనా సిద్ధంగా ఉంటాను అన్నారు. విజయసాయి రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డిలు తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ విచారణకు సిద్ధంగా ఉన్నానని.. వైసీపీ నేతలు వచ్చి నిరూపిస్తారా అని ప్రశ్నించారు.

Also watch :

Next Story

RELATED STORIES