Top

పోలీసుల తీరుపట్ల ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ తీవ్ర అభ్యంతరం

పోలీసుల తీరుపట్ల ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ తీవ్ర అభ్యంతరం
X

చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు గృహనిర్భందంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతను కలిసేందుకు కూడా నాయకులకు.. పోలీసులు అవకాశం ఇవ్వడం లేదు. ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో వెనక నుంచి చంద్రబాబు నివాసంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రామానాయుడు. అయితే అక్కడ కూడా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల తీరునకు నిరసనగా చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ అధినేతను వెంటనే పల్నాడు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసుల తీరుపట్ల ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఛలో ఆత్మకూరు పిలుపు ఇస్తే.. పోలీసులు, ప్రభుత్వం దీనిని హింసాత్మకంగా మారుస్తుందన్నారు. తమ నేతలను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పలువురు ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి చంద్రబాబు నివాసం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Next Story

RELATED STORIES