తాజా వార్తలు

నా మేనమామ వేధిస్తున్నాడు : సినీనటి

నా మేనమామ వేధిస్తున్నాడు : సినీనటి
X

ఆస్తికోసం తన మేనమామ.. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని కన్నడ సినీనటి జయశ్రీ రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌ కు వచ్చిన ఆమె.. మేనమామ గిరీశ్ పై కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో తమ ఆస్తికోసం అతను కుట్రపన్నాడని.. ఈ విషయంలో తన తల్లినీ, తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన తన తల్లిని ఇంటినుంచి బయటికి గెంటేశాడని పేర్కొన్నారు. అతడి బారినుంచి రక్షించాల్సిందిగా పోలీసులను ఆమె వేడుకున్నారు. కాగా ఈ కేసు విషయంలో జయశ్రీతో పాటు గిరీశ్‌ను విచారణకు హాజరుకావాలని సూచించారు పోలీసులు.

Next Story

RELATED STORIES