ప్రేమ కోసం మతం మార్చుకుని.. చివరకు

ప్రేమ కోసం మతం మార్చుకుని.. చివరకు
X

ఒకరిపై ఒకరికి ప్రేమ.. ఆస్తి అంతస్తులు.. కుల, మతాలను చూసి కలగదు. అదో అందమైన ప్రేమైక భావన. అనుభవించిన వారికే తెలుస్తుందంటారు. ప్రేమించిన ప్రియురాలి కోసం రాజ్యాలనే వదులుకున్న దాఖలాలున్నాయి. ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులను, ఆస్తి అంతస్తులను కాదనుకున్న ఘటనలూ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు హిందూ మతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమనీ, పెళ్లినీ అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు యువకుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యువకుడిపై ప్రశంసలు కురిపించింది న్యాయస్థానం. అతడిని ఓ గొప్ప ప్రేమికుడని వ్యాఖ్యానించింది. కుల, మతాంతర వివాహాలకు కోర్టు వ్యతిరేకం కాదంటూ, సోషలిజం పరిఢవిల్లడానికి ఇలాంటి వివాహాలు తోడ్పడతాయని స్పష్టం చేసింది. అదీకాక చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు కాబట్టి అభ్యంతరాలు ఏవీ లేవని చెప్పింది. యువతి ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ మాత్రమే తమ ప్రధాన కర్తవ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, ముస్లిం యువకుడు పెళ్లికి ముందే తన పేరును మార్చుకుని ఆర్యసమాజంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడని కోర్టు విచారణలో తేలింది.

Next Story

RELATED STORIES