దోష నివారణ చేస్తామని ఓ మహిళను..

దోష నివారణ చేస్తామని ఓ మహిళను..
X

రాకెట్ యుగంలో కూడా మూఢనమ్మకాలకు నమ్మి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎదుటివారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని నిలువెల్లా దోచుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఓ మహిళకు సర్పదోషాన్ని తొలిగిస్తామని నమ్మించి కామవాంఛ తీర్చుకుందామని ప్రయత్నించారు తండ్రీ కొడుకులు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరి ప్రాంతంలో చోటు చేసుకుంది. బాణసవాడికి చెందిన మహిళకు భర్తతో వచ్చిన విభేదాల కారణంగా అతనితో విడిపోయి తల్లిదండ్రులతో ఉంటొంది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. ఆమె కష్టాలకు కారణం సర్పదోషమే అని ఎవరో చెప్పడంతో.. దోష నివారణ కోసం మాంత్రికులైన కామస్వామి గణేశ్, అతడి కుమారుడు మణికంఠను సంప్రదించింది. దోష నివారణ చేస్తామని సదరు మహిళకు వారు చెప్పారు. పూజలు నిర్వహించి దోషాన్ని తొలగిస్తామని నమ్మబలికారు. అలాగే దోష నివారణ తొలగడం కోసం పలు సూచనలు కూడా చేశారు. ఐదుసార్లు తాళికట్టించుకుని, ఐదు సార్లు లైంగిక ప్రక్రియలో పాల్గొనాలని కామస్వామి ఆ మహిళకు తెలిపారు.

మరుసటి రోజు రాత్రి 11 గంటల సమయంలో మహిళ ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం పూజ చేసిన వస్తువులను కుక్కే సుబ్రహ్మణ్యం అనే ప్రాంతంలో వదలాలని ఆమెకు సూచించారు. ఈ లోపు తండ్రీ కొడుకులు కుక్కేలో వేరు వేరు గదులను బుక్ చేసుకుని ఆమెను లోబరుచుకోవాలని చూశారు. వారి పన్నాగాన్ని పసిగట్టిన ఆ మహిళ.. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామస్వామి గణేశ్‌ను, అతని కుమారుడు మణికంఠను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Watch :

Next Story

RELATED STORIES