Top

విచారణకు హాజరైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

విచారణకు హాజరైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
X

భూవివాదంలో ఇరుక్కున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసు విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పీఎస్‌కు వెళ్లి.. తన వద్ద ఉన్న పత్రాలనూ చూపించారు. ఇమిడేపల్లి భూమి తమదేనని వివరించారు. ఈ కేసులో సోమిరెడ్డిని అరెస్టు చేస్తారంటూ వార్తలు రావడంతో.. తెలుగుదేశం కార్యకర్తలు పీఎస్ వద్దకు భారీగా చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా పీఎస్ వద్ద కూడా భారీగా పోలీసుల్ని మోహరించారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో రెండున్నర ఎకరాల భూమిపై చాన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. సర్వే నంబర్ 58/3లో ఉన్న భూమికి మాజీ మంత్రి సోమిరెడ్డి నకిలీ పత్రాలు సృష్టించారని చెప్తూ ఏలూరు నాగిరెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో FIR కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ సోమిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160, 91 కింద నోటీసులు ఇచ్చి PSకు రావాలన్నారు. ఈ నెల తొమ్మిదినే ఈ భూముల వ్యవహారంపై స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉన్నా సోమిరెడ్డి గైర్హాజరయ్యారు. ఇవాళ వెంకటాచలం పీఎస్‌కు వెళ్లి తన వద్ద ఉన్న దస్తావేజులను చూపించారు. భూమి హక్కులపై వివాదాలు కావాలనే సృష్టించారని, ఎవరి భూములు లాక్కోవాల్సిన అవసరంతనకు లేదని వివరించారు.

Next Story

RELATED STORIES