మరోసారి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

వరద ప్రవాహం తగ్గకపోవడంతో కృష్ణా బేసిన్ జూరాల,తుంగబద్ర,సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో.. అదికారులు 6 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల నుంచి 2లక్షల 38 వేల 277క్యూసెక్కులు..సుంకేసుల నుంచి 67 వేల 872 క్యూసెక్కులతో ఇన్‌ఫ్లో 3 లక్షల 6 వేల 149 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో 1లక్ష 62 వేల 292 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు..
శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.80 అడుగుల మేరనీటి నిల్వ ఉంది. ఇక.. ప్రాజెక్టులోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా..ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 72 వేల 163 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ ఎపి,టిఎస్ జెన్‌కో అదికారులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం మిగిలి ఉన్న నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com