Top

జ్వరం తగ్గడానికి పశువుల ఇంజక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్

జ్వరం తగ్గడానికి పశువుల ఇంజక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్
X

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్వాకం.. 12 ఏళ్ల బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నితీష్ అనే బాలుణ్ని తల్లిదండ్రులు సుధాకర్‌ బాబు అనే ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. వైరల్‌ ఫీవర్‌గా నిర్ధారించిన డాక్టర్‌.. పశువుల టీకాను బాలుడికి వేశాడు. దీంతో బాలుడి శరీరంలో వింత మార్పు వచ్చేసింది. శరీరమంతా కందిపోయి బొబ్బలెక్కిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నితీష్‌ను వెంటనే తల్లిదండ్రులు కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నితీష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయబోయిన నితీష్‌ తల్లిదండ్రులను బుజ్జగించిన ఆర్ఎంపీ సుధాకర్‌ బాబు.. వైద్యానికయ్యే ఖర్చు భరిస్తానంటూ పంచాయతీ కుదుర్చుకున్నాడు. గతంలోనూ సుధాకర్‌ బాబు ఇలాంటి అరాచకాలే చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES