వినాయక నిమజ్జనంలో చిక్కుకుపోయిన ఓ అంబులెన్స్‌ని భక్తులు.. వీడియో

ఇసుక వేస్తే రాలనంత జనం.. భారీగా జనం కోలాహలం.. గణేష్ నిమజ్జన సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. పూణే వాసులంతా గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. లంబోదరుడి ఊరేగింపు బ్రహ్మాండంగా జరుగుతోంది. ఆటలు, పాటలు, డ్యాన్సులతో మైమరచిపోతోంది యువత. డప్పు మేళాలతో హోరెత్తుతోంది లక్ష్మీ రోడ్ అంతా. అయినా వినిపించింది
ఊరేగింపులో ఉన్న కొందరికి అంబులెన్స్ సౌండ్. ఒకరికొకరి సాయం వంద ఏనుగుల బలం. ఓ చిన్న సాయం మనిషి ప్రాణాలు నిలబెడుతుందంటే అంతకంటే కావలసింది ఏముంటుంది. అంతే అందర్నీ అలెర్ట్ చేశారు. పక్కకి జరగండి.. అంబులెన్స్‌కి దారివ్వండి అంటూ అరిచారు. అలా ఒకరికొకరు.. అందరూ కలిసి అంబులెన్స్ వేగంగా వెళ్లడానికి దారి ఇచ్చారు. బారులు తీరి ఉన్న భక్తుల మధ్యలోనుంచి అంబులెన్స్ సులభంగా వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవడంతో వైరల్ అవుతోంది. భక్తులు చేసిన మంచి పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#WATCH Maharashtra: Devotees give way to ambulance during Ganesh idol immersion procession on Lakshmi Road in Pune. #GaneshVisarjan (12.09.2019) pic.twitter.com/GqxtN1QmzP
— ANI (@ANI) September 13, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com