ఒక తప్పు.. ముగ్గురి ప్రాణాలను తీసింది

ఒక తప్పు.. ముగ్గురి ప్రాణాలను తీసింది
X

క్షణికావేశం ఒక కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను తీసింది. ఒక తప్పు మొత్తం కుటుంబాన్ని బలిగొంది. చివరికి మనవరాలి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న తాత కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌, స్వరూప దంపతులకు ఒక కొడుకు.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సిరివల్లి అనే కూతురు 2017లో హత్యకు గురైంది. ఈ హత్య కేసులో తాత అయిన రవీందర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

కూతరు మృతికి.. తన తండ్రే కారణమని భావించిన సిరివల్లి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసు చివరి దశలో ఉండడంతో.. రవీందర్‌ శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని భావించిన రవీందర్‌ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES