తాజా వార్తలు

పనిభారం తట్టుకోలేక మహిళా ఉద్యోగి..

పనిభారం తట్టుకోలేక మహిళా ఉద్యోగి..
X

పని ఒత్తిడి..జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ప్రాణాల మీదకు తెస్తోంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ఒక మహిళా ఉద్యోగి పనిభారం తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బడ్జెట్‌పై గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో పాల్గొన్న పంచాయితీ కార్యదర్శి స్రవంతి సభ ముగిశాక ఆఫీసులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

స్రవంతి పురుగుల మందు తాగటం గమనించిన స్థానికులు వెంటనే ఆమెను తిమ్మాజిపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. స్రవంతి స్వస్థలం నాగర్‌కర్నూల్‌. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Next Story

RELATED STORIES