దాడులపై సుజనా చౌదరి ఆవేదన.. ఆలోచనలు మారలేదు : మంత్రి బొత్స

దాడులపై సుజనా చౌదరి ఆవేదన.. ఆలోచనలు మారలేదు : మంత్రి బొత్స
X

అమరావతిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ మరోసారి డిమాండ్‌ చేసింది. రాజధాని మార్చడం అంత సులభమైన విషయం కాదన్నారు ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంపైనా పునఃసమీక్ష చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతుండడంపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటిస్తామని సుజనా చౌదరి చెప్పారు.

సుజనా చౌదరి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని నిర్మాణంపై నిన్నటి వరకు టీడీపీలో ఉన్నవారే విమర్శలు చేస్తూ, గందరగోళం స‌ృష్టించారని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. సుజనా చౌదరి పార్టీ మారారు తప్ప ఆలోచనలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. సుజనా అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ పాలనలోనే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని.. దీనిని చూసే ఓర్వలేకపోతున్నారని బొత్స విమర్శించారు.

Also watch :

Tags

Next Story