ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిని రోడ్డుపై ఈడ్చుకుంటూ..

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిని రోడ్డుపై ఈడ్చుకుంటూ..

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకునిపై అమానుషంగా దాడి చేశారు. రోడ్డుపైకి ఈడ్చి చిత్రహింసలు పెట్టారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. నేనేం తప్పు చేశానో చెప్పండి అంటూ ఆ యువకుడు వేడుకున్నా ఆ పోలీసులు కనికరించలేదు. పైగా మరింత రెచ్చిపోయి యువకున్ని దారుణంగా వేధించారు.

సిద్ధార్థనగర్ జిల్లాలోని నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ ఇద్దరు పోలీసుల కంటపడ్డాడు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించావంటూ కానిస్టేబుళ్లు, ఆ యువకుడి బైక్‌ను నిలిపి వేశారు. ఈ క్రమంలో యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ ఖాకీలు రెచ్చిపోయారు. ఆ యువకుడిపై ఒక్కసారిగా దాడి చేశారు.

ఖాకీల క్రౌర్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అప్పటికే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అధికారులు చర్యలు చే ట్టారు. యువకుడిని హింసించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

Also watch:

Tags

Read MoreRead Less
Next Story