బ్యానర్‌ ప్రాణం తీసింది

బ్యానర్‌ ప్రాణం తీసింది
X

అతిథులకు ఆహ్వానం చెబుతూ ఏర్పాటు చేసిన ఓ పెళ్ళి బ్యానర్‌ యువతి ప్రాణాలను తీసింది. చెన్నై నగరంలోని పల్లావరం సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న యువతిని బ్యానర్‌ బలితీసుకుంది. శుభశ్రీ అనే యువతి పల్లావరం రేడియల్‌ రోడ్డులో స్కూటీపై వెళుతుంది. ఆ సమయంలో స్థంభంపై ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ తెగి స్కూటర్‌పై పడడింది. దీంతో ఆ యువతి అదుపు తప్పి కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గురువారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెస్తున్నారు. శుభశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ఆసుపత్రికి తరలించారు.

కోర్టు ఆదేశాల మేరకు చెన్నై నగరపాలక సంస్థ బ్యానర్‌లపై నిషేధం విధించినప్పటికీ వాటిని బేఖాతరు చేయడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. అధికారులు ఆదేశాలు ఇచ్చినా స్ధానిక రాజకీయ నాయకులు వాటిని పాటించకుండా ఇష్టానుసారంగా బ్యానర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ బ్యానర్‌ శుభశ్రీని మృతువు రూపంలో కబళించింది. ఈ సంఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు.

Next Story

RELATED STORIES