ప్రజాస్వామ్యానికి ముప్పు : యనమల

ప్రజాస్వామ్యానికి ముప్పు : యనమల
X

సింగపూర్‌ వెళ్లి ఏపీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అమరావతికి నిధులు లేవంటూ తన విధానాన్ని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి అంతా వికేంద్రీకరణేనన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలను జగన్‌ చావు దెబ్బతీశారని యనమల ఫైరయ్యారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని.. అయినా, తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అని చెప్పి.. 100 రోజుల్లోనే ఇంతకన్నా చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారని యనమల ఎద్దేవా చేశారు.

Tags

Next Story