బంగారం ధర తగ్గింది.. 10గ్రాముల ధర..

బంగారం ధర తగ్గింది.. 10గ్రాముల ధర..
X

బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడడం వంటి అంశాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.2 శాతం క్షీణించి రూ.37,650కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర నిలకడగానే ఉంది. భవిష్యత్‌లో బంగారం ధర పెరిగే అవకాశాలున్నాయని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గింపు వంటి అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడుతుండవచ్చని వివరించింది. దేశీ మార్కెట్ విషయానికి వచ్చేసరికి.. బంగారం రేటు తగ్గుదల కలిసొచ్చే అంశమని వివరించింది.

పసిడి పడిపోవడంతో జువెలరీ కొనుగోలు దారుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. ఇక రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని కూడా కొనుగోళ్ల సంఖ్య పెరగవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. గత వారంలో 10గ్రాముల బంగార ధర రూ.39,885 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.2,200లు తగ్గి రూ.37,650కి వస్తుంది. బంగారం ధర ఇలా ఉండగా, మరోపక్క వెండి ధర కూడా తగ్గుతూనే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర కేజీకి 0.2 శాతం క్షీణతతో రూ.47,047కు దిగి వచ్చింది. గత వారం వెండి ధర గరిష్టంగా రూ.51,489 ఉంది. ఇప్పుడు అది దాదాపు 8 శాతం పతనమైంది.

Next Story

RELATED STORIES