గాజు ముక్కల్ని తింటున్న లాయర్.. వీడియో వైరల్

గాజు ముక్కల్ని తింటున్న లాయర్.. వీడియో వైరల్

ఏమిటో.. మనిషి అన్నం మానేసి అన్నీ తినేస్తున్నాడు. రికార్డు సృష్టించాలనా లేక రుచిగా ఉంటుందనా.. చిన్న గాజు ముక్క కాలికి గుజ్జుకుంటే రక్తం ధారగా కారుతుంది.. మరి అలాంటిది ఎలా తినేస్తున్నారు. ఆయనకు ఏమీ కావట్లేదా.. అయినా ఇవేం అలవాట్లో.. మేకులు తింటున్నారు.. గాజు ముక్కల్నీ తింటున్నారు. అవన్నీ తిని ఎలా బతుకుతున్నారో.. మా కాలంలో రాళ్లు తిని అరాయించుకునే వాళ్లం అని ఆ రోజుల్లో వాళ్లు తిన్న ఆహారం గురించి చెప్పేది బామ్మ. అలాంటి బామ్మ కూడా గాజు ముక్కల్ని తింటున్న లాయర్‌ని చూసి ముక్కు మీద వేలేసుకుంటుంది. ఆయన మాత్రం పగిలిన గాజు ముక్కల్ని పరపరలాడించేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని దిన్‌డోరికి చెందిన దయారామ్ సాహు లాయర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పుడు కాదండి బాబు.. గత 45 సంవత్సరాల నుంచి ఇలా గాజు ముక్కల్ని తింటున్నాను అని చెబుతున్నారు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డానని చెబుతున్నాడు. వైద్య పరంగా ఈ పరిస్థితిని 'హైలోఫాగియా' అని పిలుస్తారు. ఈ వ్యాధితో బాధపడే వారికి గాజు ముక్కలు తినాలన్న కోరిక ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదమని తెలిసినా తినాలనే కోరికను మానుకోలేకపోతారని వివరించారు. అయితే సాహూ మాత్రం.. నేను తింటున్నానని మీరూ ట్రై చేయకండి.. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు.. ఎవరూ వీటి జోలికి వెళ్లవద్దని చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story