భార్య కాపురానికి రావడం లేదని.. గొంతు కోసుకున్న భర్త

భార్య కాపురానికి రావడం లేదని.. గొంతు కోసుకున్న భర్త
X

భార్య కాపురానికి రావడం లేదని, పోలీస్ స్టేషన్ ముందే ఓ తాగుబోతు బ్లేడ్ తో గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. బిజినపల్లి మండలానికి చెందిన నిజాముద్దీన్‌కు అతని భార్యకు కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఫుల్లుగా తాగడమే కాకుండా, ఆత్మహత్య చేసుకుంటానని అతను విసిగించేవాడు. ఈసారి ఏకంగా తన మండలం కానీ నాగర్ కర్నూలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య కాపురానికి వచ్చేలా చూడాలని, లేకుంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు.

అయితే మీది బిజినపల్లి అని, అక్కడికి వెళ్లి సమస్యలు చెప్పుకోవాలని పోలీసులు నిజాముద్దీన్‌‌కు నచ్చజెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అతను.. గేట్‌ ముందు బ్లేడ్‌ తో గొంతుకోసుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు నిజాముద్దీన్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాగుడుకు బానిసైన అతను గతంలో కూడా చాలా సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

Also watch :

Next Story

RELATED STORIES