Top

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
X

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం మామడుగు దగ్గర వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. బెంగళూరు నుంచి పలమనేరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

టీటీడీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న విష్ణు... తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తన చెల్లి.. ఆమె కూతురుతో బెంగళూరు నుంచి పలమనేరుకు వెళ్తున్నారు. గంగవరం మండలం మామడుగు వద్దకు రాగానే కారు అదుపు తప్పింది.. రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో విష్ణు తీవ్ర గాయాలపాలయ్యారు.

Next Story

RELATED STORIES