తాజా వార్తలు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని రూ. 6.53లక్షల ఫైన్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని రూ. 6.53లక్షల ఫైన్
X

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ లారీ డ్రైవర్‌‌కి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు ఒడిశా రవాణా శాఖ అధికారులు. మొత్తం ఏడు నియమాల ఉల్లంఘనలకు గానూ దిలీప్‌ కర్తా అనే డ్రైవర్‌కు సంబల్‌పూర్‌ ఆర్టీఏ అధికారులు చలానా జారీ చేశారు. ఆ చలానా చూసి షాక్ అయ్యాడు దిలీప్. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నాగాలాండ్‌కు చెందిన ఆ లారీకి పత్రాలు సరిగాలేవు. గత ఐదేళ్లుగా రోడ్డు ట్యాక్స్‌ కట్టడంలేదు. వస్తువులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడు. ఇలా తదితర కారణాలు చూపి ఆ లారీకి ఏకంగా రూ.6.53లక్షలు జరిమాన విధించారు. ఆ వాహనానికి వేసిన జరిమానాను చూసిన ట్రక్కు ఓనర్‌ శైలేష్ శంకర్‌ నోరెళ్లబెట్టాడు. అయితే ఇదంతా కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత జరిగింది కాదు. ఆగస్టు 10న జరిగిన ఘటన ఇది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Watch :

Next Story

RELATED STORIES