ఎందుకిలా ఉన్నానో అడక్కండి ప్లీజ్..

ఎందుకిలా ఉన్నానో అడక్కండి ప్లీజ్..
X

మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది సమంత. ప్రతి పాత్రలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతోంది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్నా.. ఆ ఇమేజ్‌ని ఏ మాత్రం కనబడనివ్వకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తోంది. తన దృష్టి అంతా మంచి పాత్రలపైనే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంతకు అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది సమంత. చేయి తలపై పెట్టుకుని దిగాలుగా చూస్తోంది. దానికింద.. ఏమైంది నీకు.. ఎందుకిలా ఉన్నావు అని మాత్రం అడక్కండి.. అని రాసుకొచ్చింది. మామూలుగా ఫోటో పోస్ట్ చేసి ఊరుకుంటే బానే వుండేది. ప్రత్యేకంగా అడగొద్దు అని రాసేసరికే అడగాలనిపిస్తుంది. క్యూరియాసిటీనీ మరింత పెంచుతుంది. తమ అభిమాన నాయకి అలా ఉండేసరికి అస్సలు ఊరుకోలేకపోతున్నారు.. అందుకే ఏమైంది సమంతా ఎందుకిలా ఉన్నావు అని నెటిజన్లు వర్రీ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

Unfiltered !!!! Don’t ask me what I am doing with my hand though 🙄🤓🍓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Next Story

RELATED STORIES