టీచర్‌పై లైంగికదాడికి యత్నించిన విద్యార్థి

టీచర్‌పై  లైంగికదాడికి యత్నించిన విద్యార్థి
X

"గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర" అంటూ గురువును సాక్షాత్ పరబ్రహ్మగా పూజించే సమాజం మనది. అలాంటి స్ధానం కలిగిన గురువుపైనే కన్నేశాడో ఓ విద్యార్థి. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయురాలితో కామవాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామ పరిధిలోని మరుదై కొండ ఏజెన్సీకి చెందిన ఆదిద్రవిడ పాఠశాల ఉంది. అక్కడ గిరిజన సంక్షేమ శాఖలో 26ఏళ్ల వయసున్న ఉపాధ్యాయురాలు పనిచేస్తుంది.

ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడో ఓ విద్యార్ది. పాఠశాల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో అక్కడికి బస్సు సౌకర్యం లేదు. ఆ గ్రామానికి వెళ్ళాలంటే అడవి ప్రాంతంలో రెండు కిలో మీటర్ల దూరం నడవాల్సిందే. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పాఠశాల ముగిసిన తర్వాత అడవి మార్గంలో నడుస్తూ వెళుతోంది. ఈ క్రమంలో ఓ 16 ఏళ్ల యువకుడు ఆమెను అడ్డగించి అత్యాచారానికి యత్నించాడు. అతన్ని తీవ్రంగా ప్రతిఘటించి చివరకు అతని చెర నుంచి తప్పించుకుని వెళ్ళి గ్రామస్థులకు విషయాన్ని చెప్పింది. వెంటనే గ్రామస్తులు ఆ విషయాన్ని తురైయూర్‌ పోలీసులకు, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కొండ గ్రామానికి వచ్చి విచారణ జరిపారు అనంతరం సదరు విద్యార్థిని పిలిపించి సర్ది చెప్పి పంపించారు.

Next Story

RELATED STORIES