ఏపీలోని ఈ ప్రాంతాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

ఏపీలోని ఈ ప్రాంతాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ రగిలిపోతోంది. అటు అంతర్జాయంగా మద్దతు కూడా దొరక్కపోవటంతో భారత్ ను దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ పరిస్థితులపై అంతర్జాతీయంగా మరింత ఇష్యూ చేయాలని పన్నాగం పన్నుతోంది. ఇందులో భాగంగా దేశంలో పెద్దఎత్తున ఉగ్రదాడులు జరపాలని విధ్వంస రచన చేసింది పాకిస్తాన్. ఇప్పటికే పీవోకే సరిహద్దులో 200 మందికి పైగా ఉగ్రవాదులు బోర్డర్ దాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

పీవోకే దగ్గర కవ్విస్తూనే దక్షిణ భారతంలో భీకర విధ్వంస దాడికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు కుట్ర చేశాయి. దక్షిణాదిలో కోయంబత్తూరు, మధురై, ఏపీలోని ప్రఖ్యాత దేవస్థానం తిరుమల, అలాగే షార్ తదితర ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. 2008 నవంబర్ 26 నాటి ఉగ్ర దాడులను రిపీట్ చేయాలని టెర్రరిస్టులు ప్రణాళిక రచిస్తున్నారు. దేశంలో విధ్వంసం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు.

శ్రీలంక మీదుగా ముష్కరులు ప్రవేశించే అవకాశముందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. చంద్రయాన్-2 తో అంతరిక్షయానంలో ఓ స్పెషల్ ఇమేజ్ స్థాయిని పెంచుకుంది ఇస్రో. అయితే..ఆర్టికల్ 370 రద్దు అంశం అంతర్జాతీయంగా హైలెట్ అవలాంటే షార్ లో దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ముష్కర మూకల కోడ్ భాషను డీకోడ్ చేసిన నిఘా వర్గాలు, తీర ప్రాంత రాష్ట్రాలను అప్రమత్తమయ్యాయి. దాంతో గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో హై అలర్ట్ ప్రకటించారు.

నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. షార్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు మెరైన్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలు సంయుక్తంగా రంగంలో దిగాయి. బంగా ళాఖాతం వెంబడి 50 కిలోమీటర్ల మేర గస్తీని ముమ్మరం చేశారు. శ్రీహరికోట పరిసరాల్లో అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వేనాడు దర్గాకు వచ్చే వాహనా లను నిశితంగా తనిఖీ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story