గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన జబర్దస్త్‌ అనసూయ.. తలా మూడు..

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన జబర్దస్త్‌ అనసూయ.. తలా మూడు..
X

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మొదలుపెట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ ను పలువురు సెలబ్రిటీలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మిథున్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించారు. తాజాగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించారు ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ. శనివారం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌ ముందు జీహెచ్‌ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ మొక్క చుట్టూ అందమైన రంగులతో ముగ్గు వేసి.. ఆ తర్వాత తన కొడుకుతో పాటు యాంకర్‌ సుమ కనకాల, నటులు అడవి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

Next Story

RELATED STORIES