తాజా వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్
X

కచ్చులూరు బోటు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేయాలంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.. బాధితులకు అండగా నిలిచారు. పవన్‌ కల్యాణ్‌ సైతం ఈ దుర్ఙటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో అధిక సంఖ్యలో తెలంగాణవాళ్లు ఉన్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సోమవారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

Next Story

RELATED STORIES