బెల్ట్ షాప్ నిర్వహణను వ్యతిరేకించారని..

ఆధునిక యుగంలోను సమాజంలో ఆటవిక చర్యలు ఆగడం లేదు. గ్రామాలలో కొంతమంది పెద్దరాయుళ్లు సభ్య సమాజం తలదించుకునే ఘటనలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఆనాగరిక ఘటనే చోటు చేసుకుంది. చందుపట్ల గ్రామంలో అక్రమ బెల్ట్‌షాప్ వేలంపాటను అడ్డుకున్నారని ఓ సామాజిక వర్గాన్ని గ్రామ బహిష్కరణ చేశారు పెద్దలు.
చందుపట్ల గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాప్‌లు నడిపేందుకు వేలంపాట వేశారు. 2లక్షల రూపాలయకు కొంతమంది ఈ బెల్ట్‌షాపులను దక్కించుకున్నారు. ఈ విషయం తెలిసిన గౌడ కులస్తులు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహణను వ్యతిరేకించారు. మద్యం దుకాణ నిర్వహణ అక్రమని..వాటి వల్ల తాము జీవనోపాధి కూడా కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో గ్రామ పెద్దలు సదరు సామాజిక వర్గ ప్రజలను కుల బహిష్కరణ చేస్తున్నట్టు గ్రామ పంచాయితీలో తీర్మానించారు. వారిని ఎవరూ పనికి పిలవవద్దని.. వారి దుకాణ సముదాయాల్లోకి వెళ్లవద్దని.. ఈ తీర్మానాన్ని ధిక్కరించిన వారికీ 5 చెప్పు దెబ్బలు, 15వందల రూపాయల జరిమానా విధిస్తామని ఆజ్ఞాలు జారీ చేశారు. గ్రామ పెద్దల ఆటవిక చర్యపై గౌడ సంఘం తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com