భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యను ఇంట్లోనే రోకలి బండతో తలపై మోది హత్య చేశాడో భర్త. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కీర్తన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త రవే ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానించిన వారు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రవి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో భద్రాచలం గోదావరి బ్రిడ్జి పైన బైక్ పెట్టి.. నదిలో దూకి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పాల్వంచ డిఎస్‌పి మధుసూదన రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES