హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన తండ్రి యుగంధర్ కన్నుమూయడంతో లండన్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మాదాపూర్‌లోని నివాసానికి వెళ్లారు. యుగంధర్ అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహిస్తారా? లేక స్వస్థలం అనంతపురంలో నిర్వహిస్తారా? అన్నది తెలియరాలేదు.
విశ్రాంత బ్యూరోక్రాట్ యుగంధర్ పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధిలో ఎన్నో పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. పేదలకు కిలో రెండు రూపాయల బియ్యం పథకం అమలులో కీలకపాత్ర వహించినది కూడా యుగంధరే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com