జాతీయం

బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. తెలుగులో ట్వీట్..

బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. తెలుగులో ట్వీట్..
X

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని సహాయక చర్యలను ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.' అంటూ పేర్కొన్నారు ప్రధాని. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం జగన్ తో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. కాగా బోటులో మొత్తం 71 మంది ఉన్నట్టు తాజాగా తెలిసింది.

Next Story

RELATED STORIES