ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోని కోడెల..

ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోని కోడెల..

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాదరావు.. కొన్ని దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైనప్పటి నుంచి కేసులు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు కావడం కోడెల ఇమేజ్‌పై మచ్చలా మిగిలాయి. ఇటీవలే కోడెలకు గుండెపోటు రావడంతో దానికి చికిత్స తీసుకుంటున్నారు. ఇంతలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కోడెల రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.. దెబ్బలు తిన్నారు. కానీ ప్రతిసారీ ధైర్యంగా నిలబడ్డారు. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఐతే.. 2019లో ఓటమి తర్వాత రాజకీయ ఒత్తిడులు, కేసులు ముప్పేట దాడి చేయడంతో ఆయన తట్టుకోలేకపోయారు. చిన్న చిన్న వసూళ్లకు కూడా పాల్పడ్డట్టు తన ఇమేజ్ డ్యామేజ్ జరిగేలా జరిగిన ప్రచారానికి, ప్రయత్నాలకు తీవ్రంగా కలత చెందారు. ప్రత్యర్థుల రాజకీయ వ్యూహానికి ఉక్కిరిబిక్కిరైన పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి వచ్చేసింది. అకారణంగా తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఇటీవల పలు మీడియా సమావేశాలలో కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనను, తన కుమారుడిని, కుమార్తెను టార్గెట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక చివరికి ఈ ఒత్తిడులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story