మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా !

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా !

మీడియా స్వేచ్ఛకు ప్రభుత్వం సంకెళ్లు వేయడంపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.. ఏపీలో టీవీ5 ప్రసారాలను నిలిపివేయడంపై రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలతో ఆందోళనలను హోరెత్తించారు. మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించడంపై

ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీవీ5 ప్రసారాలు నిలిపివేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు కదం తొక్కారు.. ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ హిందూపురంలో ఆందోళన చేపట్టారు. టీవీ5 ప్రసారాలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ సర్కిల్లో విద్యార్థి సంఘాల ప్రతినిధులు ధర్నా చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.

అటు అంబేద్కర్‌ విగ్రహం దగ్గర వివిధ కుల సంఘాల నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టులా ఉండే మీడియాపై బ్యాన్‌ విధించడం సరైంది కాదన్నారు. టీవీ-5 ప్రసారాలను పునరుద్దరించాలంటూ నెల్లూరులో జర్నలిస్టులు ఆందోళన చేశారు. జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.. మీడియా స్వేచ్చను కాపాడాలంటూ నినాదాలు చేశారు. చానెళ్లను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మీడియా గొంతు నొక్కడం సరైంది కాదన్నారు.

ఏపీలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించడాన్ని జనసేన ఖండించింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న మీడియా గొంతు నొక్కడం దారుణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story