ఆత్మహత్యకు పాల్పడిన కోడెల శివప్రసాదరావు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఈ ఘటన జరిగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించించినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. కోడెలను బసవతారకం ఆస్పత్రికి తరలించి ICUలో చికిత్స అందించిన ఫలితం లేకపోయింది.
కోడెల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? కొంత కాలంగా ఆయన కేసులతో ఇబ్బంది పడుతున్నందున ఆ ఒత్తిడిలో ఇలా చేశారా? ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, పవర్ ఫుల్ మాస్ లీడర్‌గా పేరున్న కోడల ఇలా బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాదరావు.. కొన్ని దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైనప్పటి నుంచి కేసులు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు కావడం కోడెల ఇమేజ్‌పై మచ్చలా మిగిలాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com