Top

నాన్న మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు - కోడెల కూతురు

నాన్న మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు - కోడెల కూతురు
X

కోడెల ఆత్మహత్యపై పోలీసులకు ఆయన కూతురు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఉదయం ( సోమవారం ఉదయం) మొదటి అంతస్తుకు వెళ్లారని.. అరగంటకుపైగా కిందకు రాకపోవడంతో పైకివెళ్లినట్లు కోడెల కూతురు తెలిపారు. హ్యాంగ్ అయి ఉండడంతో.. గన్‌మెన్, డ్రైవర్‌ సాయంతో ఆస్పత్రికి తరలించినట్లు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. కోడెల ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదన్నారు. ఐతే.. నాన్న చాలారోజులుగా స్ట్రెస్‌లో ఉన్నట్లు తెలిపారు. కోడెల మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు కోడెల కూతురు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

కోడెల శివప్రసాద్‌ కూతురు విజయలక్ష్మి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసినట్లు తెలిపిన వెస్ట్ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న ఆధారాలు సేకరించామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌ వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Also watch :

Next Story

RELATED STORIES