Top

కోడెల మరణానికి ముందు..

కోడెల మరణానికి ముందు..
X

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. ఉదయం 10.30 గంటలకు ఆయన ఫస్ట్‌ ఫ్లోర్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అరగంట తరువాత 11 గంటలకు తన రూమ్‌లోకి వెళ్లిన కోడెల చాలా సేపటి వరకు బయటకు రాలేదు. 11.30 గంటలకు కోడెల కుటుంబ సభ్యులు తలుపు తట్టినా తీయకపోవడంతో.. వెనుక ఉన్న కిటికీలో నుంచి చూడగా కోడెల ఉరి వేసుకుని ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. 12 గంటల 9 నిమిషాలకు కోడెల మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Next Story

RELATED STORIES