ఇంచు కూడా తవ్వనివ్వం

ఇంచు కూడా తవ్వనివ్వం

యురేనియం తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వలేదని.. భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లమల అడవులను నాశనం కానివ్వబోమంటూ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన కేసీఆర్.. యురేనియం తవ్వకాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడం కొసమెరుపు. మిషన్ భగీరథ పథకం విజయవంతం అయిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

నల్లమల అడవులను రక్షించుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని.. భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. అటు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రత్యక్ష ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

సేవ్ నల్లమల పోరాటంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంపై సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. పర్యావరణానికి హాని కలిగించే యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. నల్లమల అడవులను నాశనం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నల్లమల అడవులను కాపాడాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు సీఎం కేసీఆర్. ప్రజల బాధను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోతే సమష్టి పోరాటం చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story