కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారు - చంద్రబాబు

కోడెలను ప్రభుత్వం మానసికంగా తీవ్రంగా వేధించిందని టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరు టెర్రరిస్ట్‌లను మించిన దానికంటే దారుణంగా ఉందన్నారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారని, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఫర్నిచర్ విషయంపై కోడెల నాలుగు లేఖలు రాశారని.. వాటికి ఆధారాల్ని చూపించారు చంద్రబాబు. కావాలనే కుట్రతో కేసులు పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల దగ్గరున్న ఫర్నిచర్ విలువ ఒకటి రెండు లక్షల రూపాయలు విలువ ఉంటే.. 43 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నిందితుడు ఈ కేసు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏ నేతను వదలకుండా కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. రాజకీయ కక్ష సాధింపులకే జగన్‌ ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి పైన, అచ్చెన్నాయుడిపైనా, నన్నపనేనిపైనా కేసులు పెట్టారని గుర్తు చేశారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story