గోదావరి పడవ ప్రమాదం.. నీటిపై తేలిన 14 మృతదేహాలు..

గోదావరి పడవ ప్రమాదం.. నీటిపై తేలిన 14 మృతదేహాలు..

గోదావరి పడవ ప్రమాదంలో మృతదేహాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 16 మృతదేహాల్ని వెలికి తీశారు. వీటిల్లో 14 మృతదేహాలు నీళ్లపై తేలడం గుర్తించారు. రెండింటిని సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న వాళ్లు బయటకు తీయగలిగారు. వెంటనే పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరానికి తరలించారు. ఇప్పడికే అక్కడకు బాధిత కుటుంబాలు చేరుకోవడంతో వారి రోదనలతో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.

3 రోజులుగా నీళ్లలోనే ఉండడంతో పాడైపోయిన స్థితిలో మృతదేహాలు ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని గుర్తించి.. పోస్ట్‌మార్టం చేశాక బంధువులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వైపున ఉన్న పట్టిసీమ వద్ద ఓ డెడ్‌బాడీ గుర్తించారు. మృతుడి జేబులోని ఐడీ కార్డు ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. అటు, పోలవరం రేవు వద్ద కూడా ఓ వ్యక్తి డెడ్‌బాడీ దొరికింది. అలాగే కచ్చులూరు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఒక్కో మృతదేహాల్ని బయటకు తీశారు. తాళ్లపూడి వద్ద ఒకటి ధవళేశ్వరం వద్ద మరొకటి కూడా వెలికి తీశారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story