హృదయ విదారక పరిస్థితి.. కడసారి చూపయినా దక్కుతుందో లేదో..!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద మునిగిన బోటు.. నదిలో 350 అడుగుల లోతులోకి వెళ్లిపోయి ఉంటుందంటున్నారు అధికారులు. గంటలు.. రోజులు.. గడుస్తున్నా గోదావరిలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. 3వ రోజు కూడా ఉదయాన్నే సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఇంకా 38 మంది ఏమయ్యారు.. వాళ్ల డెడ్‌బాడీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం 8 మృతదేహాలు బయటపడినా.. సోమవారం రోజు అన్వేషణ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఓ చిన్నారి మృతదేహాం దొరికినా అది పడవ ప్రమాదంలో చనిపోయిన వారితో సంబంధం లేదు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకూ ఫ్లడ్‌లైట్లు కూడా ఉపయోగించి గాలించినా నిరాశే మిగిలింది. అయిన వాళ్ల ఆచూకీ కోసం బంధువులంతా కచ్చులూరు వద్ద, రాజమహేంద్రవరం వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాజమహేంద్రవరం ఆస్పత్రి వద్ద పరిస్థితి అయితే హృదయ విదారకంగా ఉంది. కడసారి చూపయినా దక్కుతుందో లేదో తెలియక.. అంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
Als watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com