జమ్మలమడుగులో రెండురోజులుగా భారీ వర్షాలతో..

జమ్మలమడుగులో రెండురోజులుగా భారీ వర్షాలతో..
X

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని పెద్ద ముడియం, నేలదిన్నే గ్రామం వద్ద కుందూనది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద పెద్ద ఎత్తున పంట పొలాల్లోకి చేరుతోంది. బలపనగూడూరు, జంగాల పల్లెతో పాటు మరిన్ని గ్రామాలను వరద చుట్టు ముట్టింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని స్థానికులకు సూచిస్తున్నారు. గత పదేళ్ల నుంచి ఇలాంటి వర్షాలు పడలేదని... వర్షాలకు పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story