'సింధూతో పెళ్లి చేయాలి.. లేదంటే ఆమెను కిడ్నాప్ చేస్తా' : వృద్ధుడు

సింధూతో పెళ్లి చేయాలి.. లేదంటే ఆమెను కిడ్నాప్ చేస్తా : వృద్ధుడు
X

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుతో వివాహం జరిపించాలని 70 ఏళ్ల వృద్ధుడు ఏకంగా జిల్లా కలెక్టర్‌ ను ఆశ్రయించాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధును వివాహం చేసుకోవాలని రామనాథపురం జిల్లా కలెక్టర్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ లో తన వయసు 16 ఏళ్ళని.. సింధూతో తన వివాహం జరిపించాలని లేదంటే.. ఆమెను కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా వివాహం చేసుకుంటానని కలెక్టర్ ను హెచ్చరించాడు. ఈ అభ్యర్థనపై కలెక్టర్‌ తోపాటు ఇతర సిబ్బంది ఆశ్చర్యపోయారు. అతనికి నచ్చజెప్పినా వినలేదు. ఈ వయసులో పెళ్లి ఏంటని ప్రశ్నించినా.. మలైస్వామి మాత్రం సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టుబట్టారు. కాగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

Next Story

RELATED STORIES