వెండి తెరపై వెలుగుతున్న స్టార్లు.. తెర వెనుక వీరి పేర్లు..

వెండి తెరపై వెలుగుతున్న స్టార్లు.. తెర వెనుక వీరి పేర్లు..

కోరి సినిమాల్లోకి వస్తే అవకాశాలే రావట్లేదని కొందరు పేరు మార్చుకుంటే.. ఈ పేరు ఇంతకు ముందే మరొకరికి ఉంది.. మరేదైనా మంచి పేరు పెట్టుకోకూడదు అని కొందరి సలహా.. అబ్బాయ్ నీ పేరేదో నాకు పలకడం కష్టంగా ఉంది.. ఇదిగో ఈ పేరు పెడుతున్నా.. నీ కెందుకు నే చెప్తున్నా విను.. నువ్వు పెద్ద స్టార్‌వి అయిపోతావని ఓ దర్శకుడి చొరవ.. ఇంత అందమైన అమ్మాయికి ఆ పేరు అస్సలు సూట్ కాలేదు.. నీ పేరు ఇక నుంచి అంటూ.. పాత పేర్లు మార్చేసి కొత్త పేర్లు పెట్టేసి.. అమ్మా, అమ్మమ్మా, తాతయ్యలు పెట్టిన పేర్లు మర్చిపోయి కొత్త పేరుతోనే నటీనటులుగా వెలిగి పోతున్న వారి కొందరి పేర్లు మీ కోసం..

తమిళనాట రజనీ కాంత్ ఎంత పెద్ద సూపర్ స్టారో మనందరికీ తెలుసు.. అతడి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. శివాజీ గణేశన్ లాంటి మహా నటుడి పేరు తన పేరులో ఉందని మురిసిపోయాడు. కానీ రజనీ నటిస్తున్న మూన్రు ముడిచ్చి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కె. బాలచందర్.. శివాజీ గైక్వాడ్‌ని కాస్తా రజనీ కాంత్‌గా మార్చేశారు. ఓ తరం ప్రేక్షకుల్ని ఓ ఊపి ఊపిన నటీమణి జయమాలిని అసలు పేరు అలమేలు. దర్శకుడు రామన్న నువ్వు బాగా నాట్యం చేస్తున్నావు. మంచి నాట్యకత్తెవి కావాలి. హేమా మాలిని గొప్ప డ్యాన్సర్ కనుక ఆమె పేరులో నుంచి మాలిని తీసుకుని దానికి జయం శబ్దం కలిపి జయమాలినిగా పేరు మారుస్తానన్నారు.

101 జిల్లాల అందగాడినని డైలాగ్ నూతన్ ప్రసాద్ నోటి నుంచి రాగానే థియేటర్ చప్పట్లతో మారుమోగి పోయింది. మరి ఆయన పేరుని ఆయనే మార్చేసుకున్నారు. వరప్రసాద్ అనే పేరుతో సినిమాల్లోకి వచ్చి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఆ తరువాత అవకాశాలు రాలేదు. దాంతో పాత జీవితానికి స్వస్తి చెప్పి ఇప్పుడు నేను సరికొత్త ప్రసాద్‌ని అని చెప్పి.. నూతన్ ప్రసాద్‌గా పేరు మార్చుకుని సినిమాల్లో రాణించిన విషయం తెలిసిందే.

కవిత అసలు పేరు కృష్ణకుమారి. ఇప్పటికే ఓ కృష్ణకుమారి ఉందంటూ ఓ మంజూ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీధర్ ఆమె పేరుని కవితగా మార్చేశారు. కన్నడ చిత్రంలో దర్శకురాలిగా రాణించిన జయంతి పేరు కమల కుమారి. కానీ సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావట్లేదని జ అనే అక్షరంలో జయం ఉందని జయంతిగా పేరు మార్చుకుని తన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

ఇక శివశంకర వరప్రసాద్ పేరు చిరంజీవిగా, భక్తవత్సలం నాయుడి పేరు మోహన్‌బాబుగా, భూపతి రాజు రవి శంకర్ రాజు పేరు రవితేజగా, లక్ష్మీ నరసింహారావు పేరు సుత్తివేలుగా, ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం పేరు ఏవీఎస్‌గా, డయానా మరియం కురియన్ పేరు నయన తారగా, విజయలక్ష్మి పేరు రంభగా, సుజాత పేరు జయసుధగా, లలిత రాణి పేరు జయప్రదగా, విజయలక్ష్మి పేరు సిల్క్ స్మితగా మారి ఖ్యాతి సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story