గవర్నర్‌ తో భేటీ కానున్న చంద్రబాబు

గవర్నర్‌ తో భేటీ కానున్న చంద్రబాబు
X

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంపై సీరియస్‌గా ముందుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 12.30 కు ఆయన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలవనున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులకు సంబంధించిన వివరాలను సైతం చంద్రబాబు గవర్నర్‌కు అందించనున్నారు.

Tags

Next Story