బోటు వెలికితీత అసాధ్యమేనా..?

బోటు వెలికితీత అసాధ్యమేనా..?

కచ్చులూరు-మంటూరు దగ్గర గోదావరి నదిలో పడిపోయిన బోటును వెలికితీయడానికి NDRF, SDRF బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించారు. ముంబై నుంచి వచ్చిన మెరైన్‌ మాస్టర్ గౌరవ్‌ భక్షి... బోట్ మునిగిన కచ్చలూరు-మంటూరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు బృందం సైడ్ సోనార్ టెక్నాలజీ ద్వారా బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించింది. దీన్నిబయటకు తీయడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు 250 అడుగుల లోతులో పడ్డ బోటును తీసిన సందర్భాలు లేవు. దీంతో బోటు వెలికితీత అసాధ్యమేనన్న వాదన వినిపిస్తోంది.

మరోవైపు ప్రమాదంలో గల్లంతైన మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 32 మృతదేహాలను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వీరిలో 24 మందిని గుర్తించి బంధువులకు అప్పగించారు. 10 మంది అచూకీ తెలియాల్సి ఉంది. ఇంకా 14 మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story