తగ్గనున్న టీవీల ధరలు.. కారణం ఇదే..

తగ్గనున్న టీవీల ధరలు.. కారణం ఇదే..
X

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియాలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడి టీవీ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లను ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిపై ప్రస్తుతం 5 శాతం సుంకం వసూలు చేస్తుండగా.. తాజాగా దీనిని పూర్తిగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టీవీ రేట్లు కొంతమేరకు తగ్గుతాయని అంటున్నారు. వీటితోపాటు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(pcb), ఫిల్మ్ చిప్ లపై కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేశారు. ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానళ్లు అతి ముఖ్యమైనవి.. టీవీ తయారీలో సగం ఖర్చు దీనిపైనే వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల తయారీ ఖర్చు తగ్గనుంది. అలాగే టీవీ అమ్మకం ధరలు కూడా తగ్గవచ్చు.

Next Story

RELATED STORIES