స్వయంగా సీఎం కేసీఆర్‌ వెళ్లి కలిసినా ఫలితం లేదు - హరీష్‌ రావు

స్వయంగా సీఎం కేసీఆర్‌ వెళ్లి కలిసినా ఫలితం లేదు - హరీష్‌ రావు

అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరుపై మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. బంగారు తెలంగాణ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడితే.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని కోరినా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ వెళ్లి కలిసి నిధులు అడిగినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని హరీష్‌ రావు ఆరోపించారు.

తెలంగాణలో ఉద్యోగ నియమాక ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు. అయితే కోర్టులో కేసులు వేయడంతో ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోంది అన్నారు. ఇప్పటికే అనేక దశల్లో 900 కేసులు ఉన్నాయని వివరించారు. అయినా ఇప్పటి వరకు లక్షా 17 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియమాకాలు నినాదంతోనే తెలంగాణ ఏర్పడిందని.. ఆ దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని హరీష్‌ రావు అన్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story